Harish Rao: రెండు బడ్జెట్లలో జర్నలిస్టులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు: హరీశ్ రావు

Harish Rao Criticizes Congress Govt for Neglecting Journalists
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఫైర్
  • జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపణ
  • రెండు బడ్జెట్లలో జర్నలిస్టులకు నిధులు కేటాయించలేదని విమర్శ
  • అక్రిడిటేషన్లు, హెల్త్ స్కీమ్ వెంటనే అమలు చేయాలని డిమాండ్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత‌ టి. హరీశ్ రావు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, వారిని చూస్తేనే విసుక్కుంటోందని ఆరోపించారు. ఇవాళ వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ తెచ్చామని, జర్నలిస్టులకు పూర్తి ఉచితంగా సేవలు అందించామని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బడ్జెట్లలో జర్నలిస్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ప్రశ్నించారు.

రెండున్నరేళ్లలో ఒక్కరికైనా కొత్త అక్రిడిటేషన్‌ కార్డు ఇచ్చారా? అని ప్రభుత్వంపై హరీశ్ రావు ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే అక్రిడిటేషన్‌ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగానే జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని, లేకపోతే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంతో సమానంగా జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను కూడా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Harish Rao
Telangana
BRS
Journalists Welfare
Accreditation Cards
Health Scheme
Journalist Health Scheme
Telangana Congress
Warangal
Super Speciality Hospital

More Telugu News