Epstein files: ఎప్ స్టీన్ తో తన స్నేహంలో దాచుకోవాల్సిన వ్యవహారాలేవీ లేవన్న ట్రంప్

Donald Trump says no secrets in Epstein friendship
షార్ట్స్‌లో చూడండి
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎప్ స్టీన్ ఫైల్స్ సృష్టించిన సంచలనం తెలిసిందే. దేశాధినేతలు, మాజీలు, ప్రపంచ కుబేరుల పేర్లు బయటపడడంతో, వారితో ఎప్ స్టీన్ కు ఉన్న రహస్య స్నేహాన్ని ఈ ఫైల్స్ బయటపెట్టాయి. ఎప్ స్టీన్ సొంత ద్వీపంలో మహిళలపై జరిగిన ఘోరాలను వెలికి తీశాయి. ఈ ఫైల్స్ లో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ పేరు పలుమార్లు ప్రస్తావనకు రావడం వివాదాస్పదంగా మారింది.

ఈ విషయంలో ఎప్పటికప్పుడు ట్రంప్ వివరణ ఇస్తూ వస్తున్నారు. తాజాగా మరోమారు ఎప్ స్టీన్ ఫైల్స్ వ్యవహారంపై ఆయన స్పందించారు. జెఫ్రీ ఎప్ స్టీన్ తో తన స్నేహం విషయంలో దాచుకోవాల్సిన రహస్యాలు ఏవీ లేవని తేల్చిచెప్పారు. తాను ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో తనకు కోర్టు కూడా క్లీన్ చీట్ ఇచ్చిందని గుర్తుచేశారు.

ఎప్ స్టీన్ ఫైల్స్ బయటపెట్టింది తమ ప్రభుత్వమేనని ట్రంప్ చెప్పారు. ఎప్ స్టీన్ డెమోక్రాటిక్ పార్టీ సభ్యుడని, ఆయనతో రిపబ్లికన్లకు ఎలాంటి రహస్య బంధాలు లేవని స్పష్టం చేశారు. మాజీ అధ్యక్షుడు క్లింటన్ సహా పలువురు డెమోక్రాటిక్ నేతలకే ఎప్ స్టీన్ తో రహస్య బంధాలు ఉన్నాయని, ఈ విషయం అందరికీ తెలిసిందేనని ట్రంప్ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Epstein files
Donald Trump
Jeffrey Epstein
Bill Clinton
Democratic Party
Republican Party
US President
Epstein Island
sex trafficking
political scandal

More Telugu News