Ramasubbamma: 78 ఏళ్ల పరుగుల రాణి... రామసుబ్బమ్మపై సజ్జనార్ ప్రశంసలు
- నెల్లూరు జిల్లా కావలికి చెందిన 78 ఏళ్ల అథ్లెట్ రామసుబ్బమ్మపై సజ్జనార్ ప్రశంసలు
- వివిధ పోటీల్లో ఇప్పటికే 12 బంగారు పతకాలు సాధించిన వృద్ధురాలు
- ఆమె సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన హైదరాబాద్ సీపీ
- చెడు వ్యసనాలకు బానిసవుతున్న యువతకు చురకలు అంటించిన సజ్జనార్
78 ఏళ్ల వయసులోనూ పరుగుల పోటీల్లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్న ఓ వృద్ధురాలిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రశంసల వర్షం కురిపించారు. పట్టుదలకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్న ఆమె, నేటి యువతకు గొప్ప స్ఫూర్తి అని ఆయన కొనియాడారు. 'రాకింగ్ రామసుబ్బమ్మ' అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్ ను కూడా సజ్జనార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నెల్లూరు జిల్లా కావలికి చెందిన 78 ఏళ్ల రామసుబ్బమ్మ, గతంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఇళ్లలో పనులు చేసుకుంటూనే అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నారు. ట్రాక్‌పై చిరుతలా పరుగెడుతూ ఇప్పటివరకు 12 బంగారు పతకాలను గెలుచుకున్నారు. త్వరలో అంతర్జాతీయ వేదికపై దేశం తరఫున పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో రామసుబ్బమ్మ సంకల్ప బలాన్ని ప్రస్తావిస్తూ సజ్జనార్ ఓ సందేశాన్ని విడుదల చేశారు. "వార్ధక్యం శరీరానికే కానీ, సంకల్పానికి కాదు" అని రామసుబ్బమ్మను చూస్తే అనిపిస్తుందని అన్నారు. 78 ఏళ్ల వయసులో ఆమె పతకాల వేటలో ఉంటే, కొందరు యువత చిన్న వయసులోనే బద్ధకానికి బానిసలై, స్మార్ట్‌ఫోన్ల మాయలో పడి భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, మద్యం వంటి వ్యసనాల్లో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హితవు పలికారు.
రామసుబ్బమ్మ అడుగుజాడల్లో నడిచి, శ్రమను నమ్ముకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు. "సలాం రామసుబ్బమ్మ గారు, మీ పట్టుదలే అందరికీ స్ఫూర్తిదాయకం" అంటూ ఆయన తన సందేశాన్ని ముగించారు.