Saket Srinivas: అమెరికాలో అదృశ్యమైన 22 ఏళ్ల కర్ణాటక విద్యార్థి

Saket Srinivas 22 Year Old Karnataka Student Missing in America
  • బర్కిలీలో భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యం
  • 10వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన కర్ణాటక వాసి
  • రంగంలోకి దిగిన శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం
  • కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని, గాలింపు కొనసాగుతోందని ప్రకటన
  • సాకేత్ పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్‌తో కూడిన బ్యాగ్ లభ్యం
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మరో భారతీయ విద్యార్థి అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. కాలిఫోర్నియాలోని ప్రతిష్ఠాత్మక బర్కిలీ విశ్వవిద్యాలయంలో (యూసీ బర్కిలీ) చదువుతున్న సాకేత్ శ్రీనివాసయ్య (22) అనే విద్యార్థి కనిపించకుండా పోయాడు. కర్ణాటకకు చెందిన సాకేత్, ఈ నెల 10వ తేదీ నుంచి కనిపించడం లేదని స్థానిక అధికారులు తెలిపారు.

ఐఐటీ-మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసిన సాకేత్, ప్రస్తుతం యూసీ బర్కిలీలో కెమికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. బర్కిలీ పోలీసులు అతడిని 'at-risk' మిస్సింగ్ పర్సన్‌గా ప్రకటించి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. సాకేత్ అదృశ్యం పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, అతడి కుటుంబ సభ్యులతోనూ, స్థానిక అధికారులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.

సాకేత్ చివరిసారిగా బర్కిలీ హిల్స్‌లోని లేక్ అంజా సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. అతని పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్‌తో కూడిన బ్యాగ్‌ను ఓ ఇంటి ముందు గుర్తించడం గమనార్హం. సుమారు 6 అడుగుల 1 అంగుళం పొడవు ఉండే సాకేత్ ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు. ప్రస్తుతం ఈస్ట్ బే రీజినల్ పార్క్ డిస్ట్రిక్ట్ పోలీసుల సహకారంతో బర్కిలీ పోలీసులు గాలింపును కొనసాగిస్తున్నారు.
Saket Srinivas
Saket Srinivas missing
UC Berkeley student missing
Indian student missing California
Lake Anza Berkeley
East Bay Regional Park District
Karnataka student missing
US student missing
Chemical Engineering Masters

More Telugu News