Piyush Dhamnodia: ఇండోర్ 'ఎంబీఏ' విద్యార్థిని దారుణ హత్య: నగ్నంగా మృతదేహం.. ఆ వీడియోనే ప్రాణం తీసిందా?

Indore MBA Student Murdered Allegedly by Boyfriend Piyush Dhamnodia
  • ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య
  • ప్రియుడి అద్దె గదిలో కుళ్లిన స్థితిలో మృతదేహం
  • గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల అనుమానం
  • వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరాన్ని ఒక భయంకరమైన హత్యోదంతం ఉలిక్కిపడేలా చేసింది. ఉన్నత చదువులు చదువుతున్న ఒక ఎంబీఏ విద్యార్థిని, తన క్లాస్‌మేట్ చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వెలుగుచూసిన అంశాలు ప్రేమ పేరుతో సాగే వికృత చేష్టలకు అద్దం పడుతున్నాయి. మంగళవారం బర్త్‌డే పార్టీ కని చెప్పి వెళ్లిన 24 ఏళ్ల యువతి, శుక్రవారం నాడు తన ప్రియుడు పీయూష్ ధనోటియా ఉంటున్న అద్దె గదిలో నగ్నంగా, శవమై తేలడం కలకలం రేపింది.

ఈ దారుణం వెనుక పక్కా పథకం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి అదృశ్యమైన రోజే ఆమె మొబైల్ ఫోన్ నుంచి కాలేజీ వాట్సాప్ గ్రూపులోకి ఒక అశ్లీల వీడియో అప్‌లోడ్ అయింది. అందులో యువతి ముఖం స్పష్టంగా కనిపిస్తుండగా, నిందితుడు తన ముఖాన్ని ఎమోజీలతో కప్పివేశాడు. ఈ వీడియో చూసి దిగ్భ్రాంతికి గురైన కాలేజీ యాజమాన్యం, వెంటనే దాన్ని తొలగించి ఆమె తండ్రికి సమాచారం అందించింది. అప్పటికే బాధితురాలి ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు.

అయితే పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. బుధవారమే ఫిర్యాదు చేసినా పోలీసులు త్వరగా స్పందించలేదని, ఒక కానిస్టేబుల్ నిందితుడి గది వరకు వెళ్లి తలుపు లాక్ చేసి ఉండటంతో వెనక్కి వచ్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నాటికి గది నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు ఫిర్యాదు చేయగా, పోలీసులు తలుపులు పగలగొట్టి చూడటంతో దారుణం వెలుగుచూసింది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో, తండ్రి తన కూతురిని ఆమె ధరించిన సాక్స్ ఆధారంగా మాత్రమే గుర్తుపట్టగలిగారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం నిందితుడు పీయూష్ ఆమెను తాడుతో ఉరివేసి చంపి పరారయ్యాడు. నిందితుడు బాధితురాలిని గత కొంతకాలంగా మానసిక వేదనకు గురిచేస్తూ, అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మందసౌర్ ప్రాంతానికి చెందిన నిందితుడు పీయూష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని కీలక విషయాలు వెల్లడిస్తామని డీసీపీ కృష్ణ లాల్‌చందాని తెలిపారు.
Piyush Dhamnodia
Indore MBA student murder
MBA student murdered
Indore crime
Piyush Dhamnodia absconding
Blackmail murder
Crime news
Madhya Pradesh crime
Indore police
Obscene video

More Telugu News