Pawan Kalyan: తిరుమలలో అపచారాలకు నాటి పాలక మండలే కారణం: పవన్ కల్యాణ్
పాలక మండళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే దేవాలయాల్లో ఎలాంటి అపచారాలు, తప్పులు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల వంటి పుణ్యక్షేత్రంలోనే ఎన్నో అపచారాలు జరిగాయని, నాటి పాలక మండలి సరిగ్గా పనిచేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదని ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సూచించారు.
శుక్రవారం సచివాలయం నుంచి శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గాన్ని పవన్ కల్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో ఈ రహదారిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "మన ఆలయాలు నాగరికతకు, సంస్కృతికి, వారసత్వానికి చిహ్నాలు. వాటి పరిరక్షణ మనందరి బాధ్యత. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో ఆలయాల అభివృద్ధికి, ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నాం," అని అన్నారు. అరుణాచలంలో మాదిరిగా శ్రీకాళహస్తిలోనూ గిరిప్రదక్షిణ చేయాలన్న కోరిక తనకు ఉందని, త్వరలోనే క్షేత్రాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటానని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వివరించారు. దేవాదాయ శాఖ సహకారంతో రూ.40 కోట్లకు పైగా నిధులతో 22 ప్రధాన దేవాలయాలకు రహదారి వసతి కల్పిస్తున్నామని తెలిపారు. కోటప్పకొండ, వాడపల్లి సహా అనేక క్షేత్రాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం గిరిప్రదక్షిణ మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని చెప్పారు. అరుణాచలం తరహాలో ప్రతి పౌర్ణమికీ శ్రీకాళహస్తిలో కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని నూతన పాలక మండలికి ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నుంచి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆలయ ఈవో బాపిరెడ్డి, ఇతర అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.