Telangana Panchayats: తెలంగాణ పంచాయతీలకు శుభవార్త... కేంద్రం నుంచి రూ.387 కోట్లు విడుదల

Good News for Telangana Panchayats Rs 387 Crore Released by Central Government
  • వారం క్రితం తొలి విడతలో రూ.259.63 కోట్లు విడుదల
  • రెండు విడతల్లో కలిపి రూ.646.46 కోట్ల నిధులు విడుదల
  • పెండింగ్‌లో ఉన్న మరో రూ.2,400 కోట్ల నిధులు
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం రూ.387 కోట్ల నిధులు విడుదల చేసింది. వారం రోజుల క్రితం తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసింది. తాజాగా మరోసారి విడుదల చేయడంతో రెండు విడతల్లో కలిపి రూ.646.46 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్టయింది.

ఈ నిధులతో, గ్రామపంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించనుంది. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు మరో రూ.2,400 కోట్ల నిధులు రావాల్సి ఉంది. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా ఉండటానికి పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి విడతలుగా నిధులు వస్తున్నాయి.
Telangana Panchayats
Telangana
Panchayats
Central Government Funds
Village Development

More Telugu News