DK Shivakumar: డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలి: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్
- 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారన్న ఇక్బాల్ హుస్సేన్
- పార్టీ కోసం శివకుమార్ చేసిన కృషికి ఆయన ముఖ్యమంత్రి కావాలన్న ఎమ్మెల్యే
- అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి
డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ పునరుద్ఘాటించారు. కర్ణాటకలో గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ సాగుతోంది. ఈరోజు ఇక్బాల్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం శివకుమార్ చేసిన కృషికి ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని చాలామంది ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారని అన్నారు.
కర్ణాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 140 మంది ఎమ్మెల్యేలు మార్పును ఆశిస్తున్నారని, 80 నుంచి 90 వరకు ఎమ్మెల్యేలు ఈ అంశంపై చర్చించుకుంటున్నారని అన్నారు. తామంతా శివకుమార్‌కు మద్దతిస్తున్నామని అన్నారు.
ఇదిలా ఉండగా, సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారిగా భావిస్తున్న ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్లడంపై కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. పార్టీ కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి విదేశీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లను అడిగినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై జరుగుతోన్న ప్రచారాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేల విదేశీ పర్యటనకు వెళ్లారని సిద్ధరామయ్య వర్గం చెబుతోందని తెలుస్తోంది.