Sreeleela: ఎంబీబీఎస్ పూర్తి... వైద్య పట్టా అందుకున్న నటి శ్రీలీల

Actress Sreeleela Receives Medical Degree After Completing MBBS
  • సినిమాల్లో నటిస్తూనే వైద్య విద్యను అభ్యసిస్తున్న నటి
  • ఫిబ్రవరి 10న పట్టా అందుకున్న శ్రీలీల
  • శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులు, నెటిజన్లు
అందాల హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు అధికారికంగా డాక్టర్ అయ్యారు. సినిమాల్లో నటిస్తూనే ఆమె వైద్య విద్యను అభ్యసించారు. ఆమె ముంబైలోని డివై పాటిల్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య పట్టాను అందుకున్నారు. ఫిబ్రవరి 10న జరిగిన ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు, పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒక చిత్రంలో వేదికపై మెరూన్ రంగు దుస్తులు ధరించిన శ్రీలీల స్నాతకోత్సవ వేడుకలో డిగ్రీని స్వీకరిస్తున్నట్లు ఉంది.

ఇంట్లో జరిగిన సంఘటన కారణంగా డాక్టర్ కావాలని...

తన ఇంట్లో జరిగిన ఒక సంఘటన కారణంగా తాను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నట్లు శ్రీలీల ఒక సందర్భంలో వెల్లడించారు. ఓసారి తన అమ్మమ్మ కిందపడిపోయినప్పుడు, వైద్యుడైన తన అన్నయ్య వచ్చి చిన్నపాటి చేయడంతో ఆమె మామూలు స్థితికి వచ్చిందని అన్నారు. అప్పుడే తాను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఆ కారణంగానే సినిమాల్లోకి వచ్చినప్పటికీ డాక్టర్‌గా సేవ చేయాలన్న తన సంకల్పాన్ని వదల్లేదని అన్నారు.
Sreeleela
Sreeleela MBBS
Sreeleela Doctor
DY Patil University
MBBS Degree
Telugu Actress
Medical Degree

More Telugu News