Aishwarya Arjun: తెలుగు తెరపై అందమైన వారసత్వం .. ఐశ్వర్య అర్జున్!

Aishwarya Arjun Special
షార్ట్స్‌లో చూడండి
స్టార్ హీరోల వారసుల పిల్లలు హీరోలుగా తమ జోరు చూపించడం చాలా కాలం నుంచి ఉన్నదే. అయితే స్టార్ హీరోల కూతుళ్లు మాత్రం హీరోయిన్ కావాలనే ఆలోచన చేసేవారు కాదు. అందుకు అనేక కారణాలు కనిపిస్తాయి. అయితే అలాంటి కాలం గతంలోకి జారిపోయి చాలాకాలమే అవుతోంది. సీనియర్ స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్స్ గా తెరపై సందడి చేయడానికి ఉత్సాహాన్ని కనబరుస్తూ వస్తున్నారు.

అలాంటి హీరోయిన్స్ జాబితాలో ఇప్పడు అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా చేరిపోయింది. ఐశ్వర్య 2013లోనే ఎంట్రీ ఇచ్చింది. అయితే కెరియర్ ను ఆమె సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించలేదు. తమిళ .. కన్నడ భాషల్లో మాత్రమే రెండు మూడు సినిమాలు చేసిన ఆమె, ఇప్పుడు 'సీతా పయనం' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. 

ఇది ప్రేమకథా చిత్రం .. ఈ సినిమాకి అర్జున్ దర్శకత్వం వహించడం విశేషం. తండ్రి దర్శకత్వంలో లవ్ స్టోరీస్ చేయవలసి రావడం నిజానికి కాస్త ఇబ్బందిని కలిగించే విషయమే. అయినా అర్జున్ ను ఒక దర్శకుడిగా మాత్రమే భావిస్తూ ఐశ్వర్య ఈ సినిమా చేసింది. గ్లామర్ పరంగా ఐశ్వర్యకి వంక బెట్టాల్సిన అవసరం లేదు. మరి నటన పరంగా ఎన్ని మార్కులు పడతాయనేది చూడాలి. అర్జున్ చాలా కసరత్తు చేసి తీసిన ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి. 

Go Back to Shorts
Aishwarya Arjun
Seetha Payanam
Arjun Sarja
Telugu cinema
Tamil cinema
Kannada cinema
Star kids
Tollywood debut
Love story movie
Telugu movie release

More Telugu News