Roslyn: ఉక్కిరిబిక్కిరి చేసే మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ .. ఓటీటీలో!
- కీలక పాత్రల్లో మీనా - వినీత్
- ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- 4 భాషల్లో అందుబాటులోకి
థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను తెరకెక్కించడంలో మలయాళ మేకర్స్ తమదైన మార్క్ ను చూపిస్తూ ఉంటారు. వాళ్లు కథను ఎంచుకునే తీరు .. ఆ కథను నడిపించే విధానం .. ట్విస్టులు .. సహజత్వానికి దగ్గరగా పాత్రలను నడిపించే విధానం ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తూ ఉంటాయి. అందువల్లనే ఓటీటీలలో మలయాళ థ్రిల్లర్ సిరీస్ లకు విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలాంటి వెబ్ సిరీస్ ఒకటి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆ సిరీస్ పేరే ' రోస్లిన్'.
ఈ సిరీస్ కి వినాయక్ శశికాంత్ కథను అందించారు. సుమేశ్ నందకుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి, 'దృశ్యం' దర్శకుడు జీతూ జోసెఫ్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్నాడు. దాంతో ఈ సిరీస్ అనూహ్యమైన మలుపులతో పరుగులు పెడుతుందని ఆడియన్స్ భావిస్తున్నారు. మీనా .. వినీత్ .. బేబీ సంజన ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 'జియోహాట్ స్టార్' లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
కథలోకి వెళితే ..'రోస్లిన్' అనే ఒక పాప చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రలోకి జారుకోగానే ఆ పాపకి ఒక పీడకల వస్తూ ఉంటుంది. కలలో ఒక చిత్రమైన వ్యక్తి ఆమెను వెంటాడుతూ ఉంటాడు. దాంతో ఆ పాప నిద్రపోవడానికి భయపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా పాప పరిస్థితి పట్ల ఆందోళన చెందుతారు.'రోస్లిన్'కి ఆ కల ఎందుకు వస్తోంది? కలలో ఆమెకి కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అనేది మిగతా కథ.