Peddi Movie: 'పెద్ది' సెకండ్ సింగిల్‌కు ముహూర్తం.. ప్రేమికుల రోజున చరణ్ మాస్ ట్రీట్!

Ram Charan Peddi Movie Second Single to Release on February 14th
  • 'పెద్ది' సినిమా నుంచి రెండో పాట విడుదలకు రంగం సిద్ధం
  • ప్రేమికుల రోజు కానుకగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేసే అవకాశం
  • రామ్‌చరణ్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసే ఇంట్రడక్షన్ సాంగ్‌గా రూపకల్పన
  • జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో రానున్న పవర్‌ఫుల్ పాట‌
  • ఇప్పటికే తొలి పాట 'చికిరి చికిరి' యూట్యూబ్‌లో సంచలనం
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది'పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా నుంచి రాబోయే ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి పాట 'చికిరి చికిరి' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదలకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం 'పెద్ది' రెండో పాటను ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్స్ డే) సందర్భంగా ఈ నెల‌ 14న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ పాట రామ్‌చరణ్ క్యారెక్టర్‌ను పరిచయం చేసే పవర్‌ఫుల్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా ఉండబోతోందని సమాచారం. చరణ్ మాస్ ఎనర్జీని, పాత్ర స్వభావాన్ని గ్రాండ్‌గా ఎలివేట్ చేసేలా ఈ గీతాన్ని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచినట్లు తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు నృత్యాలు సమకూర్చడం అంచనాలను మరింత పెంచుతోంది. ఈ పాటలో చరణ్ డాన్స్ మూమెంట్స్ అభిమానులకు కనుల పండుగ చేయనున్నాయని టాక్ వినిపిస్తోంది.

వాస్తవానికి ఈ పాటను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు వాలంటైన్స్ డేకి రిలీజ్ చేయాలనే నిర్ణయం సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సైతం ఈ పాట అభిమానులకు ఒక బ్లాస్ట్‌లా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.

'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత రామ్‌చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'పెద్ది'పై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి' పాట ఒక్క తెలుగులోనే 150 మిలియన్లకు పైగా, అన్ని భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, శివ రాజ్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Peddi Movie
Ram Charan
Buchi Babu Sana
AR Rahman
Janhvi Kapoor
Valentines Day Song Release
Telugu Movie
Chikiri Chikiri Song
Rural Sports Drama
Johnny Master Choreography

More Telugu News