New Zealand Cricket: టీ20 వరల్డ్ కప్: ఆఫ్ఘనిస్థాన్ పై న్యూజిలాండ్ ఈజీ విక్టరీ

New Zealand T20 World Cup Victory Over Afghanistan
  • 183 పరుగుల భారీ లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించిన కివీస్
  • ఆఫ్ఘన్ బ్యాటర్ గుల్బదిన్ నయీబ్ (63) మెరుపు ఇన్నింగ్స్ 
  • కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన సీఫర్ట్ (65), ఫిలిప్స్ (42)
  • 13 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించిన న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ గెలుపు బోణీ కొట్టింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 183 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ జట్టు 17.5 ఓవర్లలోనే ఛేదించి టోర్నీలో తమ తొలి గెలుపును నమోదు చేసుకుంది.

భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 14 పరుగులకే ఓపెనర్ ఫిన్ అలెన్ (1), రచిన్ రవీంద్ర (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వికెట్ కీపర్ టిమ్ సీఫర్ట్ (65), గ్లెన్ ఫిలిప్స్ (42) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ దూకుడుగా ఆడి జట్టును విజయానికి చేరువ చేశారు. చివర్లో డారిల్ మిచెల్ (25 నాటౌట్), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (17 నాటౌట్) వేగంగా ఆడి మరో 13 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్‌కు మంచి ఆరంభం లభించలేదు. అయితే, మిడిల్ ఆర్డర్‌లో గుల్బదిన్ నయీబ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా సెదికుల్లా అటల్ (29), రసూలీ (20) రాణించడంతో అఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
New Zealand Cricket
T20 World Cup
Afghanistan
Tim Seifert
Glenn Phillips
Gulbadin Naib
Chennai
cricket match
Daryl Mitchell
Mitchell Santner

More Telugu News