Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్ ఇదే

Pawan Kalyan Ustaad Bhagat Singh Release Date Announced
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ కాంబోలో సినిమా వస్తుండటంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదల తేదీని ప్రకటించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుండగా, రాశీ ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ విడుదల తేదీని ప్రకటించడంతో పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. #UBSOnMarch26th అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Ustaad Bhagat Singh
Harish Shankar
Sreeleela
Mythri Movie Makers
Telugu cinema
Tollywood
Devi Sri Prasad
Raashi Khanna
UBSOnMarch26th

More Telugu News