Ajit Pawar: అజిత్ పవార్ అంతిమయాత్రలో చోరీ.. ఏడుగురి అరెస్టు

Theft During Ajit Pawar Funeral Seven Arrested
షార్ట్స్‌లో చూడండి
విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గత గురువారం బారామతి విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో జరిగాయి. ఆ సమయంలో కొంతమంది దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అజిత్ పవార్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంత్యక్రియల అనంతరం పదిహేను మంది తమ బంగారం, ఇతర ఖరీదైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. 
Go Back to Shorts
Ajit Pawar
Ajit Pawar funeral
Maharashtra Deputy Chief Minister
Theft at funeral
Crime news
Vidya Pratishthan

More Telugu News