Donald Trump: చైనా, పాకిస్థాన్‌లపై భారత్ 'సర్జికల్ స్ట్రైక్'.. అమెరికా డీల్‌తో తిరుగులేని ఆధిక్యం!
- డ్రాగన్‌కు చుక్కలు.. భారత్‌కు సుంకాల వెసులుబాటు
- పాక్, బంగ్లాదేశ్ కంటే తక్కువ పన్నుతో ఇండియా దూకుడు
- అమెరికా మార్కెట్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' హవా
- బిలియన్ డాలర్ల ఎగుమతులకు మార్గం సుగమం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సరికొత్త వాణిజ్య ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక 'బూస్టర్ డోస్' లాంటిదని చెప్పవచ్చు. ఈ ఒప్పందం కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాదు, ఆసియా ఖండంలోని మన ప్రధాన పోటీదారులైన చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యాన్ని కట్టబెట్టింది.
అమెరికా మార్కెట్‌లో ఇప్పటివరకు చైనా ఉత్పత్తులే రాజ్యమేలేవి. కానీ తాజా ఒప్పందం ప్రకారం చైనా వస్తువులపై అమెరికా సుమారు 37 శాతం వరకు సుంకాలు విధిస్తుంటే, భారత వస్తువులపై కేవలం 18 శాతం మాత్రమే విధిస్తోంది. అంటే, అమెరికా మార్కెట్‌లో చైనా వస్తువుల కంటే భారత వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. దీనివల్ల అమెరికన్ కంపెనీలు చైనాను వదిలి భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
కేవలం చైనానే కాదు, మన పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోల్చినా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. అమెరికా విధిస్తున్న పన్నుల వివరాలు ఇలా ఉన్నాయి
టెక్స్‌టైల్ (దుస్తులు), లెదర్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో బంగ్లాదేశ్, వియత్నాం మనకు గట్టి పోటీ ఇస్తుంటాయి. ఇప్పుడు వారి కంటే మనకు తక్కువ పన్ను ఉండటంతో, భారత ఎగుమతిదారులు గ్లోబల్ మార్కెట్‌లో తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను అందించగలరు. ఇది మన దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యానికి పెద్ద పీట వేయనుంది.
ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థలు 'ఆపిల్', 'టెస్లా' తమ సప్లై చైన్‌ను చైనా నుంచి భారత్‌కు మార్చే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ తయారీలో భారత్ ఇప్పటికే చైనాను వెనక్కి నెడుతుండగా, ఈ 18 శాతం టారిఫ్ నిర్ణయం ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది. ఇది భారత ఎగుమతులను ఏడాదికి అదనంగా 20-30 బిలియన్ డాలర్ల మేర పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

- భారత్: 18 శాతం
- పాకిస్థాన్: 19 శాతం
- బంగ్లాదేశ్: 20 శాతం
- వియత్నాం: 20 శాతం