Rahul Gandhi: భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడిందనే మాట నేను చెప్పింది కాదు: రాహుల్ గాంధీ

Rahul Gandhi denies claiming Chinese incursion cites Army ex chief
షార్ట్స్‌లో చూడండి
భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడిందనేది తాను చెప్పిన మాట కాదని, స్వయంగా ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే తన పుస్తకంలో రాశారని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ పుస్తకం బయటకు వస్తే అసలు విషయాలు ప్రజలకు తెలిసిపోతాయనే భయంతో ఆ పుస్తక ప్రచురణను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.

లోక్ సభ వాయిదా పడిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని లోక్ సభలో లేవనెత్తేందుకు అనుమతించడం లేదని ఆరోపించారు. నరవణే రాసిన పుస్తకం పబ్లిష్ అయితే ప్రభుత్వ నేతలు మన సైన్యాన్ని ఎలా నిరాశపరిచారనే విషయాలు ప్రజలు తెలుసుకుంటారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు చెబుతాననే తనను మాట్లాడనీయడం లేదని అన్నారు.
Go Back to Shorts
Rahul Gandhi
China border
Indian Army
Manoj Naravane
Priyanka Gandhi
India China conflict
Book publication
Parliament
National security
Wayanad MP

More Telugu News