దేశంలో ఆందోళనలు... ట్రంప్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర ఆగ్రహం
- ఇతర దేశాలకు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టి సారించాలని ట్రంప్‌కు సూచన
- విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించేది లేదని హెచ్చరిక
- ఇతర దేశాధ్యక్షుడిని సంతోష పెట్టేందుకు సొంత వీధులను నాశనం చేస్తున్నారని ఆగ్రహం
విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మల్లా వ్యవహరించే వారిని సహించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాధ్యక్షుడిని సంతోషపెట్టేందుకు సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారని ఇరాన్ ఆందోళనకారులను ఉద్దేశించి అన్నారు. సొంత దేశంలో అశాంతిని రగిలించేందుకు పాశ్చాత్య శక్తులకు కొందరు వంత పాడుతున్నారని ఆయన విమర్శించారు.
ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహ్లావి ఇచ్చిన పిలుపు మేరకు ఇరాన్‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దేశంలో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు నిలిపివేసినప్పటికీ ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ స్పందించారు.