ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
- సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు
- ఎత్తిపోతల, కృష్ణా జలాల్లో ఒప్పందంపై తప్పుదోవ పట్టించారని పేర్కొన్న ఎమ్మెల్యేలు
- సభాపతి సూచనల మేరకు శాసన సభ కార్యదర్శికి నోటీసులు అందజేత
సభాపతి సూచన మేరకు ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతిరెడ్డికి నోటీసులు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కేపీ వివేకానంద్, కోవ లక్ష్మి తదితరులు ఉన్నారు.