సర్వీసెస్‌పై ఢిల్లీ విజయం.. అదరగొట్టిన రిషబ్ పంత్
- 37 బంతుల్లో 67 పరుగులతో చెలరేగిన పంత్
- 4 ఫోర్లు, 6 సిక్సులతో రాణించిన వికెట్ కీపర్ బ్యాటర్
- 45 బంతుల్లో 72 పరుగులతో రాణించిన ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య
తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 178 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో వికాస్ హత్వాలా (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ పుల్కిత్ నారంగ్ (22), టెయిలెండర్లు పూనమ్ సుభాష్ పూనియా (23), రాజ్ బహదూర్ పాల్ (25) కొంతమేర రాణించారు. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 19.4 ఓవర్లలోనే ఛేదించింది.
ఢిల్లీ జట్టులో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 45 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (67), నితీశ్ రాణా (32) కూడా రాణించారు. ఢిల్లీకి ఇది ఐదు మ్యాచ్‌లలో నాలుగో విజయం కావడం విశేషం.