Donald Trump: ట్రంప్ ‘టారిఫ్’ విధానాలు ఒక విపత్తు.. దుమ్మెత్తిపోసిన అమెరికా మీడియా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు ఆ దేశానికే శాపంగా మారుతున్నాయని అక్కడి మీడియా వర్గాలు మండిపడుతున్నాయి. విదేశీ వస్తువులపై ఆయన విధిస్తున్న భారీ సుంకాలు, తద్వారా మొదలైన వాణిజ్య యుద్ధాలు ఒక ‘డిజాస్టర్’ (విపత్తు) అని ప్రముఖ మీడియా సంస్థ ఎస్‌సీఎన్‌జీ తన సంపాదకీయంలో ధ్వజమెత్తింది.
ట్రంప్ విధానాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ నెలలో 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.01 లక్షల కోట్లు) భారీ పరిహారాన్ని ప్రకటించింది. అయితే, తన సొంత నిర్ణయాల వల్ల సృష్టించబడిన సమస్యను పరిష్కరించడానికి ఇంత భారీ మొత్తంలో ప్రజా ధనాన్ని వెచ్చించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యం కాదా? అని మీడియా ప్రశ్నించింది. ఈ సుంకాలు విదేశాల మీద కాకుండా, అమెరికా వినియోగదారులపై పడుతున్న అదనపు పన్నులని ఎడిటోరియల్ విశ్లేషించింది.
ముఖ్యంగా గ్లోబలైజేషన్ కాలంలో ఇలాంటి పాతకాలపు వాణిజ్య పద్ధతులు పని చేయవని, ఇవి దేశ ఆర్థిక వృద్ధిని మందగింపజేయడమే కాకుండా ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రైతులకే కాకుండా, ట్రాక్టర్ తయారీ దిగ్గజం 'జాన్ డీర్' వంటి సంస్థలకు కూడా ఈ విధానాల వల్ల 600 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని, ఇది అమెరికా పారిశ్రామిక రంగాన్ని ప్రమాదంలోకి నెడుతోందని మీడియా సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.