ఆపరేషన్ సిందూర్ తో తీవ్రంగా భయపడిన పాక్... అందుకు ఇదే నిదర్శనం!
Add ap7am to your home Screen

ఆపరేషన్ సిందూర్ తో తీవ్రంగా భయపడిన పాక్... అందుకు ఇదే నిదర్శనం!

Asif Ali Zardari Reveals Fear During Operation Sindoor
  • 'ఆపరేషన్ సింధూర్' వేళ బంకర్‌లోకి వెళ్లమన్నారని అంగీకరించిన పాక్ అధ్యక్షుడు జర్దారీ
  • పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్య
  • ఆపరేషన్ సమయంలో పాక్ అగ్రనాయకత్వంలో తీవ్ర భయాందోళన
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌' పాకిస్థాన్ ఉన్నత నాయకత్వాన్ని ఎంతగా భయపెట్టిందో స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మాటల్లోనే వెల్లడైంది. ఆపరేషన్ సమయంలో తనను బంకర్‌లోకి వెళ్లి దాక్కోవాలని సైన్యం సూచించిందని ఆయన అంగీకరించారు. ఈ వ్యాఖ్యలతో భారత దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

ఇటీవల ఓ బహిరంగ సభలో జర్దారీ మాట్లాడుతూ, "నా మిలటరీ సెక్రటరీ నా వద్దకు వచ్చి, 'ఆపరేషన్ సిందూర్‌' పేరుతో భారత్ దాడులు చేస్తోంది, యుద్ధం ప్రారంభమైంది, మనం బంకర్‌లోకి వెళదాం' అని సూచించాడు" అని తెలిపారు. అయితే, తాను ఆ సూచనను తిరస్కరించానని, "నాయకులు యుద్ధభూమిలోనే ప్రాణాలు విడుస్తారు కానీ, బంకర్లలో కూర్చుని చనిపోరు" అని ధీమాగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ 'ఆపరేషన్ సిందూర్‌'ను చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలు, సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణులతో విరుచుకుపడింది. కనీవినీ ఎరుగని రీతిలో భీకరదాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
భారత్ దాడుల తీవ్రతకు పాక్ అధ్యక్ష భవనం సైతం వణికిపోయిందనడానికి జర్దారీ వ్యాఖ్యలే నిదర్శనం. ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న కఠిన వైఖరి పాకిస్థాన్‌ను ఏ స్థాయిలో కలవరానికి గురిచేసిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
Advertisement
Asif Ali Zardari
Operation Sindoor
Pakistan
India
Surgical Strike
Terrorist Camps
PoK
బ్రహ్మోస్ మిస్సైల్
Jammu Kashmir
Pahalgam Terrorist Attack

More Telugu News