శ్రీలంకకు మానవతా సాయం.. పాకిస్థాన్ ఆరోపణలను ఖండించిన భారత్
- భారత్ ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ నిరాకరించిందని పాకిస్థాన్ ఆరోపణ
- ఖండించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ
- పాక్ విజ్ఞప్తికి గంటల్లోనే అనుమతి ఇచ్చినట్లు వెల్లడి
ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్‌పై పాకిస్థాన్ చేసిన ప్రకటన గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జైశ్వాల్ సమాధానమిస్తూ, పాకిస్థాన్ చేసిన అభ్యర్థనను భారత్ త్వరగా పరిశీలించి, ఓవర్ ఫ్లైట్ అనుమతిని మంజూరు చేసిందని వెల్లడించారు. పాకిస్థాన్ చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు. పాక్ వాదనను ఆయన పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
శ్రీలంకకు మానవతా సహాయం తీసుకువెళుతున్న పాకిస్థానీ విమానాలకు ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ కోసం డిసెంబర్ 01న మధ్యాహ్నం 1.00 గంటలకు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు దరఖాస్తు అందిందని తెలిపారు. మానవతా సహాయం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం అదే రోజున అభ్యర్థనను వేగంగా పరిశీలించి అనుమతిని మంజూరు చేసిందని పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు ఓవర్ ఫ్లైట్ అనుమతిని మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. క్లిష్ట సమయంలో శ్రీలంక ప్రజలకు సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు.