కుటుంబమంతా దేశసేవలోనే.. విషాదంలో తేజస్ పైలట్ నమాన్ష్ కుటుంబం
- నమాన్ష్ భార్య అఫ్షాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్
- తండ్రి ఆర్మీలో సేవలందించి పదవీ విరమణ
- స్వగ్రామం హిమాచల్ ప్రదేశ్ లోని పతియాల్కర్ లో అంత్యక్రియలు
తల్లి వీణ గృహిణి కాగా, నమాన్ష్ భార్య అఫ్షాన్ కూడా ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. నమాన్ష్ దుబాయ్ ఎయిర్ షోలో ప్రదర్శన చేస్తున్న సమయంలో అఫ్షాన్ కోల్ కతాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రమాద వార్త తెలిసి హుటాహుటిన కోయంబత్తూరులోని అత్తామామల వద్దకు చేరుకున్నారు. నమాన్ష్, అఫ్షాన్ దంపతులకు ఆర్య (7) అనే కుమార్తె ఉంది. కాగా, హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా పతియాల్కర్ గ్రామంలో నమాన్ష్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు పూర్తవుతాయని ఆయన బంధువులు తెలిపారు.