గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి .. 22 మంది మృతి
- పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
- ఈ దాడుల్లో 22 మంది మరణించినట్లు వెల్లడి
- హమాస్ ఉగ్రవాదులే లక్ష్యమని స్పష్టం చేసిన ఇజ్రాయెల్
గాజా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గాజా నగరంలో 12 మంది, ఖాన్ యూనిస్ ప్రాంతంలో మరో 10 మంది మరణించారు. ఈ మృతుల సంఖ్యను హమాస్ వర్గాలు ధ్రువీకరించాయి.
అయితే, ఈ దాడులపై ఇజ్రాయెల్ మిలిటరీ భిన్నమైన వాదన వినిపిస్తోంది. తమ దేశంపై దాడి చేసేందుకు హమాస్ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారన్న సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ఈ స్ట్రైక్స్ జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో గాజా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.