జనవరి నుంచి 80 వేలకు పైగా వీసాలను రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం
- రెండోసారి అధికారంలోకి రాగానే అక్రమ వలసలపై ట్రంప్ ఉక్కుపాదం
- వీసాలు రద్దైన వారిలో ఉల్లంఘనలకు పాల్పడిన వారు అధికంగా ఉన్నారని కథనం
- కథనాన్ని ధ్రవీకరించిన శ్వేతసౌధం
ఈ ఏడాది జనవరిలో ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం అక్రమ వలసదారులను వెనక్కి పంపించే కార్యక్రమం చేపట్టారు. దీంతోపాటు సోషల్ మీడియా వెట్టింగ్‌తో పాటు స్క్రీనింగ్‌ను విస్తృతం చేశారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించే వారి వీసాల రద్దును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వీసాల రద్దు భారీగా పెరిగినట్లు ఆ కథనం పేర్కొంది.
రద్దైన వీసాలను పరిశీలిస్తే, మద్యం సేవించి వాహనం నడిపిన వారు 16 వేలు, దాడుల్లో ప్రమేయమున్న వారు 12 వేలు, చోరీ కేసుల్లో 8 వేల మంది ఉన్నట్లుగా సమాచారం. రద్దైన 80 వేల వీసాల్లో విద్యార్థి వీసాలు 8 వేలకు పైగా ఉన్నట్లు కథనం పేర్కొంది. ఈ విషయాన్ని ధ్రవీకరిస్తూ శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.