వేములవాడ రాజన్న ఆలయంలో బూజుపట్టిన లడ్డూ.. స్పందించిన మంత్రి కొండా సురేఖ
- బూజు పట్టిన లడ్డూల ఘటనపై భక్తుల ఆగ్రహం
- ఘటనపై పూర్తి వివరాలు అందించాలని కొండా సురేఖ ఆదేశం
- ఫుడ్ సేఫ్టీ అధికారులకు లేఖ రాసినట్లు ఈవో వెల్లడి
స్పందించిన మంత్రి కొండా సురేఖ
వేములవాడలో లడ్డూలకు బూజు పట్టిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. దేవాలయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని మంత్రి సూచించారు. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో ఆహార భద్రతా అధికారులకు లేఖ రాసినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడుతామని, భక్తుల మనోభావాలను గౌరవిస్తామని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.