ఆంధ్రప్రదేశ్‌కు 4 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు.. స్పందించిన చంద్రబాబునాయుడు
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు
- మంగళసముద్రం, బైరుగణిపల్లె, పలాస, శాఖమూరులలో ఏర్పాటు
- ప్రధాని మోదీకి చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మంగళసముద్రం, బైరుగణిపల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, అమరావతిలోని శాఖమూరులో ఈ నూతన విద్యా సంస్థలు కొలువుదీరనున్నాయి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు నాణ్యమైన విద్యావకాశాలను అందించడంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా ఉన్న ప్రాంతాల అవసరాలను తీర్చడంలో ఈ విశ్వవిద్యాలయాలు తోడ్పడుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.