Karur Stampede: తొక్కిసలాట ఘటనను 2 వారాల ముందే ఊహించి చెప్పిన వ్యక్తి.. వీడియో ఇదిగో!

Karur Stampede Predicted Weeks in Advance
  • అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక్క తొక్కిసలాట అయినా జరిగితీరుతుందని వ్యాఖ్య
  • కనీసం 50 మంది వరకు మరణిస్తారని, విజయ్ అనే వ్యక్తే కారణమవుతాడని వెల్లడి
  • డీఎంకే కంటే 10 రెట్లు విషపూరిత వ్యక్తులంటూ తీవ్ర విమర్శలు
తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 41 కి చేరింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో జనం హాజరుకావడంతో ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సింగిల్ జడ్జి విచారణకు ఆదేశించింది. 

అయితే, ఈ దుర్ఘటన గురించి ఓ వ్యక్తి రెండు వారాల క్రితమే ఆశ్చర్యకరంగా ట్వీట్ చేశాడు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కనీసం ఒక్క తొక్కిసలాట ఘటన అయినా చోటుచేసుకుంటుందని, అందులో కనీసం 50 మంది యువత ప్రాణాలు కోల్పోతారని ట్వీట్ చేశాడు. ఈ ఘటనకు విజయ్ అనే దుర్మార్గుడే కారణమవుతాడని చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి మరో వ్యక్తి ఇదే తరహా ఆరోపణలు చేసిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్వీట్ లో ఏమని చెప్పాడంటే..
‘తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల సమయానికి కనీసం ఒక్క తొక్కిసలాటైనా జరిగి తీరుతుంది. అందులో కనీసం 50 మంది యువత ప్రాణాలు కోల్పోతారు. వీటన్నింటికీ విజయ్ అనే వ్యక్తి కారణమవుతాడు. వారు బుద్ధిలేని, క్రూరమైన ఆటవికుల వంటివారు. డీఎంకే కంటే 10 రెట్లు విషపూరితమైన వ్యక్తులు. రాజకీయాల్లో ప్రతిపక్షం, కూటమి భాగస్వాములు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం రాష్ట్ర రాజకీయాల్లోని మూర్ఖత్వాన్ని సూచిస్తుంది” అని పేర్కొన్నారు.
Karur Stampede
Tamil Nadu
TVK
stampede prediction
Vijay
assembly elections 2026
political rally
India news

More Telugu News