Nara Devaansh: దేవాన్ష్‌కు నా దీవెనలు: నారా భువనేశ్వరి
- నారా దేవాన్ష్‌కు లండన్‌లో అరుదైన గౌరవం
- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం ప్రధానం
- పదేళ్లకే చెస్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన దేవాన్ష్
- మనవడి విజయంపై నారా భువనేశ్వరి హర్షం
- దేవాన్ష్ ప్రతిభ కుటుంబానికి గర్వకారణమంటూ ట్వీట్
నారా వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. కేవలం పదేళ్ల వయసులోనే నారా దేవాన్ష్ అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నాడు. చదరంగంలో కనబరుస్తున్న అద్భుత ప్రతిభకు గుర్తింపుగా లండన్‌లో దేవాన్ష్ కు విశిష్ట పురస్కారం అందించారు. దీనిపై దేవాన్ష్ నాయనమ్మ నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
లండన్‌లోని చారిత్రక వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో దేవాన్ష్‌కు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ గౌరవం లభించింది. చిన్న వయసులోనే చెస్ క్రీడలో క్రమశిక్షణ, అంకితభావంతో దేవాన్ష్ చూపిస్తున్న ప్రతిభకు ఈ పురస్కారం ఒక నిదర్శనంగా నిలిచింది.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి తన మనవడిని అభినందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. "నా ప్రియమైన మనవడు దేవాన్ష్, లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవాన్ని అందుకున్నందుకు నా ప్రేమ, ఆశీస్సులు. పదేళ్లకే చెస్‌లో నీ ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం మా కుటుంబానికి ఎంతో గర్వకారణం. నువ్వు ఇలాగే ఉజ్వలంగా రాణిస్తూ మరెన్నో మైలురాళ్లు అందుకోవాలి" అని ఆమె ఆకాంక్షించారు.