Rajinikanth: 'కూలీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఖాయమైనట్టే!
- ఆగస్టు 14వ తేదీన విడుదలైన 'కూలీ'
- 14 రోజులలో 500 కోట్లకి పైగా వసూళ్లు
- అమెజాన్ ప్రైమ్ చేతికి ఓటీటీ హక్కులు
- సెప్టెంబర్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్
రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందిన 'కూలీ', ఆగస్టు 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, 14 రోజులలోనే 500 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. నిజానికి ఈ సినిమా 1000 కోట్ల వరకూ రాబడుతుందని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆ స్థాయి వరకూ వెళ్లలేకపోయింది. ఊహించిన పాత్రలు బలహీనంగా .. ఊహించని పాత్రలు బలంగా ఉండటంపై కొన్ని విమర్శలు తలెత్తాయి.
అయితే రజనీ తరువాత సౌబిన్ షాహిర్ - రచితా రామ్ పాత్రలు హైలైట్ కావడం అందరినీ ఆకట్టుకుంది. కమల్ కూతురు శ్రుతి హాసన్.. రజనీ కూతురుగా నటించడం కూడా కొంతమందికి కొత్తగా అనిపించింది. ఇక నిర్మాణ పరమైన విలువల పరంగా కూడా ఈ సినిమా మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ నెల 14వ తేదీతో ఈ సినిమా విడుదలై నెల రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీకి వస్తుందా? ఇంకా ఆలస్యమవుతుందా? అనే ఒక సందేహంతో చాలామంది వెయిట్ చేస్తున్నారు.
అలాంటి వారి నిరీక్షణ త్వరలో ఫలించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయవచ్చనే ఒక టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావలసి ఉంది. సత్యరాజ్ .. ఉపేంద్ర .. ఆమిర్ ఖాన్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.