ప్లాట్ ఫాం ఫీజు భారీగా పెంచేసిన స్విగ్గీ
- వినియోగదారులకు షాక్ ఇచ్చిన స్విగ్గీ
- మెట్రో నగరాల్లో భారీగా ఫ్లాట్ ఫారమ్ ఫీజులు పెంచిన వైనం
- తన ప్లాట్‌ఫారమ్ ఫీజును రూ.10 వద్ద కొనసాగిస్తొన్న జొమాటో
2023లో కేవలం రూ.2గా ఉన్న ఈ ఫీజు, ఇప్పటివరకు 600 శాతం పెరిగింది. మరోవైపు జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును రూ.10 వద్ద కొనసాగిస్తోంది. 2024 ప్రారంభం నుంచి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాల్లో ప్లాట్‌ఫారమ్, హ్యాండ్లింగ్ ఫీజులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా సంస్థలు ఒక్కో ఆర్డర్‌పై రూ.9–15 వరకు వసూలు చేస్తున్నాయి. ఇది సగటు ఆర్డర్ విలువలో 1–3 శాతం వరకు ఉంటుంది.
మెట్రో నగరాల్లో బిగ్‌బాస్కెట్, ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటి సంస్థలు మాత్రమే ఉండటంతో హ్యాండ్లింగ్, కన్వీనియెన్స్, స్మాల్ ఆర్డర్ ఫీజులు సాధారణమవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక్కో ఆర్డర్‌పై రూ.5 అదనంగా వసూలు చేసినా సంస్థలకు భారీ ఆదాయం లభిస్తుంది. వినియోగదారులను ఆకర్షించడానికి గతంలో ఎక్కువ ఖర్చు చేసిన ఈ సంస్థలు, ఇప్పుడు లాభాల పెంపుపై దృష్టి సారిస్తున్నాయి.