Gandhi: రంగారెడ్డి జిల్లాలో 1,500 గాంధీ విగ్రహాలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- ప్రైవేటు పాఠశాలలో వినూత్నంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- మహాత్ముడి గొప్పతనం, విలువలు తెలియజేయాలనే ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడి
- ప్రత్యేక మెమొంటోను అందజేసిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్
రంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వినూత్నంగా జరిగాయి. అబ్దుల్లాపూర్మెట్ మండలం మన్నెగూడలోని ఒక పాఠశాలలో 1,500 గాంధీ విగ్రహాలను ప్రదర్శించారు.
మహాత్ముడి గొప్పతనం, ఆయన విలువలు ఈ తరం చిన్నారులకు తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాఠశాలకు ప్రత్యేక మెమొంటోను అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.