ట్రంప్ తో చేదు అనుభవం ఎదురైందన్న నటి
- అమెరికా అధ్యక్షుడిపై మళ్లీ లైంగిక వేధింపుల ఆరోపణలు
- జెఫ్రీ ఎప్ స్టీన్ ఆఫీసులో రాత్రిపూట ట్రంప్ తనను అదోలా చూశారని ఆరోపణ
- ఎప్ స్టీన్ తో కలిసి పనిచేసేందుకు తాను సిద్దపడ్డ సమయంలో ఘటన
జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించిన ఎప్ స్టీన్ ఫైల్స్ విడుదల చేయాలని అమెరికా వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మారియా ఫార్మర్ 1996లోనే ఎప్‌స్టీన్, మ్యాక్స్‌వెల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వారు సెక్స్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మారియా ఈసారి డొనాల్డ్ ట్రంప్ పై ఆరోపణలు చేశారు. మారియా ఆరోపణలపై వైట్ హౌస్ స్పందిస్తూ.. ఎప్‌స్టీన్‌తో స్నేహాన్ని ట్రంప్ వదిలేసి చాలాకాలం అవుతోందని పేర్కొంది. ట్రంప్ ఏనాడూ ఎప్‌స్టీన్ ఆఫీస్‌కు వెళ్లలేదని వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ వెల్లడించారు.