Upendra: మరో తెలుగు మూవీలో ఉపేంద్ర!

Upendra to Star in Another Telugu Movie
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఆయన దర్శకత్వం వహించిన అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఉపేంద్ర, ఆ తర్వాత నేరుగా పలు తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు. కన్యాదానం, ఒకే మాటతో మొదలై సన్నాఫ్ సత్యమూర్తి, గని వంటి చిత్రాల్లో ఉపేంద్ర నటించారు.

ప్రస్తుతం రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఆంధ్ర కింగ్’ సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు ఆయన మరో తెలుగు సినిమాకు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉపేంద్రను ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ కలిసి కథ వినిపించారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్న ఈ కథకు ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు వంద కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 
Go Back to Shorts
Upendra
Upendra Telugu movie
Andhra King
Ram Pothineni
Jayashankar
Pan India movie
Kannada actor
Telugu cinema

More Telugu News