లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- 270 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 61 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.71
అమెరికా టారిఫ్ విధానాలపై నెలకొన్న అనిశ్చితి, భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడంతో మదుపర్లు రోజంతా అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే, చివరి అరగంటలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాల బాట పట్టాయి.
సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో పాటు ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, ఎన్టీపీసీ, బీఈఎల్ షేర్లు రాణించాయి. మరోవైపు, టైటాన్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టాలను చవిచూశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.71 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 69.37 డాలర్లుగా ఉండగా, ఔన్స్ బంగారం ధర 3,333 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.