అమెరికాతో అణు చర్చలు జరిపే ప్రసక్తే లేదు: ఇరాన్
- అణు ఒప్పందాలపై చర్చలకు రావాలని అమెరికా కోరిందన్న ఇరాన్
- తమపై దాడులు ఆగేంత వరకు చర్చలు ఉండవని స్పష్టీకరణ
- ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా ఉందని అనుమానిస్తున్నామన్న ఇరాన్ మంత్రి
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ విషయంపై స్పందిస్తూ, అణు ఒప్పందంపై చర్చలకు రావాల్సిందిగా అమెరికా కోరిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల వెనుక ఖచ్చితంగా అమెరికా హస్తం ఉందని తాము అనుమానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నప్పటికీ, అమెరికా ప్రోత్సాహంతోనే ఇజ్రాయిల్ ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని ఇరాన్‌తో పాటు అనేక దేశాలు విశ్వసిస్తున్నాయని ఆయన అన్నారు.