సంగారెడ్డి రామ్ మందిర్‌లో జగ్గారెడ్డి భక్తి పారవశ్యం.. డోలు వాయిస్తూ కీర్తనలు!
- సంగారెడ్డి రామ్ మందిర్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
- స్వయంగా డోలు వాయించి అందరినీ ఆకట్టుకున్న వైనం
- కీర్తనలకు అనుగుణంగా డోలుతో సందడి చేసిన జగ్గారెడ్డి
ఆయన డోలు వాయిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆయన అభిమానులు ఈ వీడియోను 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. "ఇది ఒక ప్రజానాయకుడి భక్తి రూపం! సంగారెడ్డి రామ్ మందిర్‌లో భక్తి గీతాల మధ్య... భక్తి, వినయం, మనస్పూర్తి... ఇది రాజకీయాలకు అతీతమైన మానవత్వం!" అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.