BCCI: స్వదేశీ టెస్టుల షెడ్యూల్‌లో మార్పులు.. బీసీసీఐ కీలక ప్రకటన

BCCI Updates India South Africa West Indies Test Series Venues
షార్ట్స్‌లో చూడండి
బీసీసీఐ 2025 అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో భాగంగా స్వదేశంలో జరగనున్న కొన్ని కీలక టెస్ట్ మ్యాచ్‌ల వేదికల్లో మార్పులు చేసినట్లు సోమవారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లతో జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చింది. మ్యాచ్‌ల నిర్వహణకు మెరుగైన పరిస్థితులు కల్పించడం, ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇందులో భాగంగా 2025 నవంబర్ 14న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌ను కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌కు మార్చారు. ఈ మార్పుతో సుదీర్ఘ కాలం తర్వాత ఈడెన్ గార్డెన్స్ ఓ ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అలాగే వెస్టిండీస్‌తో జరగాల్సిన రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందుగా కోల్‌కతాను వేదికగా నిర్ణయించగా, తాజా మార్పులతో ఆ మ్యాచ్‌ను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మార్చారు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. 

ఆటగాళ్లకు, అభిమానులకు సాధ్యమైనంత ఉత్తమమైన సౌకర్యాలు, మంచి అనుభూతి కల్పించే విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు బీసీసీఐ వివరించింది. పురుషుల మ్యాచ్‌లతో పాటు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ వేదికల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి రెండు వన్డేలు న్యూ చండీగఢ్‌లోని న్యూ పీసీఏ స్టేడియంలో జరగనుండగా, చివరి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మారింది.

అప్‌డేటెడ్‌ షెడ్యూల్ ఇదే...
ఇండియా వ‌ర్సెస్‌ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్
మొదటి టెస్ట్ - అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 6 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో
రెండో టెస్ట్ - అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 14 వరకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో


భారత్ వ‌ర్సెస్‌ దక్షిణాఫ్రికా
మొదటి టెస్ట్- నవంబర్ 14 నుండి నవంబర్ 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్
రెండోటెస్టు- నవంబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు గౌహతిలో

మొదటి వన్డే - నవంబర్ 30 - రాంచీ
రెండో వన్డే - డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో
మూడో వన్డే - డిసెంబర్ 6 - వైజాగ్

మొదటి టీ20- డిసెంబర్ 9 - కటక్‌లో
రెండో టీ20- డిసెంబర్ 11 - ముల్లన్పూర్
మూడు టీ20- డిసెంబర్ 14 - ధర్మశాల
నాలుగో టీ20- డిసెంబర్ 17 - లక్నో
ఐదో టీ20- డిసెంబర్ 19 - అహ్మదాబాద్
Go Back to Shorts
BCCI
India vs South Africa
India vs West Indies
Test Series
Cricket Schedule
Eden Gardens
Arun Jaitley Stadium
Narendra Modi Stadium
ODI series
Womens Cricket

More Telugu News