ఇదిగో ఇందుకే మేం దాడులు చేస్తున్నాం.. ఇజ్రాయెల్ సైన్యం
- గాజా ఆసుపత్రి కింద హమాస్ సొరంగం వీడియో షేర్ చేసిన ఐడీఎఫ్
- హమాస్ ఉగ్రవాదులు సామాన్యులను రక్షణ కవచంగా వాడుకుంటున్నారని ఆరోపణ
- ప్రజలను అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్ పై దాడులకు పాల్పడుతోందని ఫైర్
వీడియోలోని దృశ్యాలను గమనిస్తే.. యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్‌లో ఓ సొరంగం కనిపిస్తోంది. దీనిని హమాస్ కమాండ్-అండ్-కంట్రోల్ సెంటర్‌గా ఉపయోగిస్తోందని, ఇక్కడి నుంచే ఇజ్రాయెల్ పై దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఐడీఎఫ్ ఆరోపించింది. సొరంగంలో ఆయుధాలు, నిఘా సామగ్రి ఇతర పరికరాలు ఉంచిన కంట్రోల్ రూములు కూడా కనిపిస్తున్నాయి.
హమాస్ తన ప్రయోజనాల కోసం గాజాలోని ఆసుపత్రులను స్థావరాలుగా వాడుకుంటూ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని ఐడీఎఫ్ ఆరోపించింది. 2023లోనూ ఇదే విధంగా గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్ షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది. వాటిని ధ్వంసం చేయడానికి తాము దాడులు చేసినప్పుడు అక్కడ ఉన్న అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారని వివరించింది.