కేబినెట్ సమావేశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- నెలకు రెండుసార్లు కేబినెట్ సమావేశాలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ
- విధాన నిర్ణయాల్లో జాప్యం నివారించేందుకే ఈ చర్యలు
ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ప్రతి నెల మొదటి మరియు మూడవ శనివారాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. సాధారణంగా కీలకమైన అంశాలపై చర్చించి, ఆమోదం తెలిపేందుకు కేబినెట్ సమావేశాలు జరుగుతుంటాయి. అయితే, ఈ సమావేశాలు మరింత తరచుగా జరగడం వల్ల ప్రజా ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలపై త్వరితగతిన చర్చించి, నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.