Punjab Kings: పంజాబ్ కింగ్స్ తో ముంబయి ఇండియన్స్ ఢీ... గెలిస్తే పంజాబ్ కు టాప్ ప్లేస్
- ముగింపు దశకు చేరిన ఐపీఎల్ లీగ్ దశ
- నేడు జైపూర్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తులు ఖాయమైనప్పటికీ, ఈ మ్యాచ్ లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. నేటి మ్యాచ్ కు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ప్రస్తుతం పంజాబ్ టీమ్ం 13 మ్యాచ్ ల్లో 8 విజయాలు సాధించి 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ గెలిస్తే 19 పాయింట్లతో టాప్ కు చేరుకుంటుంది. మరో వైపు ముంబయి ఇండియన్స్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకుంది. ఆ జట్టు ఈ మ్యాచ్ లో గెలిస్తే రెండో స్థానానికి ఎగబాకుతుంది. ముంబయి టీమ్ 13 మ్యాచ్ ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.