Mohanlal: ఇదెక్కడి క్రైమ్ థ్రిల్లర్?: 28 కోట్లు పెడితే 200 కోట్లకి పైగా తెచ్చిందే!

Thudarum Movie Update
షార్ట్స్‌లో చూడండి
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారి సంఖ్య చాలా ఎక్కువ. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి అంతా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మోహన్ లాల్ నుంచి ఒక క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లకు వచ్చింది .. ఆ సినిమా పేరే 'తుడరుమ్'. రెంజిత్ నిర్మించిన ఈ సినిమాకి, తరుణ్ మూర్తి దర్శకత్వం వహించాడు. 

ఏప్రిల్ 24వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేశారు. మోహన్ లాల్ సరసన 'శోభన' నటించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. మోహన్ లాల్ కి గల క్రేజ్ గురించి .. మార్కెట్ గురించి తెలియంది కాదు. అయినా కథకు తగినట్టుగా ఖర్చు చేస్తూ, కేవలం 28 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. 

అలాంటి ఈ సినిమా కేరళలోనే 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. మలయాళ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన మూడో సినిమాగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది. అలాంటి ఈ సినిమా, జూన్ లో 'హాట్ స్టార్' ద్వారా స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. 

కథ విషయానికి వస్తే .. హీరో ఒక ట్యాక్సీ డ్రైవర్. నీతి - నిజాయితీతో కూడిన సింపుల్ లైఫ్ అతనిది. ఆయనకు ఇద్దరు పిల్లలు. హీరో కొడుకు తన తండ్రి కారులో స్నేహితులతో కలిసి సరదాగా 'చెన్నై' కి వెళతాడు. ఆ కారులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసులు కారు సీజ్ చేస్తారు. ఆ సంఘటనతో హీరో లైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లో పడుతుందనేది కథ.

Go Back to Shorts
Mohanlal
Malayalam Crime Thriller
TUDUM
Mollywood
Indian Cinema
Box Office Success
Renjith
Tarun Moorthy
Malayalam Movies
Hotstar

More Telugu News