డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ డాక్టర్.. హైదరాబాద్ లో ఘటన
- ఏడాదిలో రూ.70 లక్షల డ్రగ్స్ కొనుగోలు చేసిన మహిళా వైద్యురాలు
- ప్రముఖ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యురాలు
- ముంబైలోని డ్రగ్ డీలర్ కు వాట్సాప్ లో ఆర్డర్
రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ పేటలోని ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన మహిళా వైద్యురాలు సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. డ్రగ్స్ కు బానిసైన డాక్టర్.. కొన్నేళ్లుగా వాటిని వినియోగిస్తున్నారు. ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వాన్స్ టక్కర్‌ను వాట్సాప్ లో సంప్రదించి రూ.5 లక్షల విలువైన కొకైన్ కు ఆర్డర్ చేశారు. ఆన్ లైన్ లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడంతో వాన్స్ తన సహాయకుడు బాలకృష్ణ రాంప్యార్ రామ్ ద్వారా కొకైన్ పంపించాడు.
నగరానికి కొకైన్ తీసుకొచ్చిన రాంప్యార్.. ఆ ప్యాకెట్ ను డాక్టర్ కు అందిస్తుండగా పోలీసులు సీన్ లోకి ఎంటరయ్యారు. డాక్టర్ తో పాటు రాంప్యార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.