'మండాడి' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌.. వైల్డ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన‌ సుహాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మండాడి' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌.. వైల్డ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన‌ సుహాస్

Suhass Wild Look in Mandaadi First Look Poster
     
కోలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైన‌ వెట్రిమార‌న్ సినిమాల్లో పాత్ర‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటి ఓ మంచి ఛాన్స్‌... టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ అందుకున్నారు. వెట్రిమార‌న్ బ్యాన‌ర్‌లో రూపొందుతున్న‌ 'మండాడి' లో సుహాస్ ఓ కీల‌క పాత్ర పోషించారు.

ఈ మూవీ తెలుగు ఫ‌స్ట్‌ లుక్ ఈరోజు విడుద‌లైంది. ఇందులో సుహాస్ వైల్డ్ లుక్‌లో చాలా ప్రామిసింగ్ గా క‌నిపిస్తున్నారు. వెట్రిమారన్ స్టైల్ లో సాగే రా అండ్‌ ర‌స్టిక్ స్పోర్ట్స్ డ్రామా ఇది. త‌మిళంలో సుహాస్‌కు ఓర‌కంగా మంచి బిగినింగ్ అనుకోవాలి. ఈ సినిమాలో చాలా స‌ర్‌ప్రైజ్‌లు ఉన్నాయ‌ట‌. అవ‌న్నీ ఒకొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది.

ఇక‌, ఈ చిత్రంలో కోలీవుడ్ న‌టుడు సూరి మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మతిమార‌న్ పుగ‌ళేంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో మ‌హిమా నంబియార్ హీరోయిన్‌. అలాగే స‌త్య‌రాజ్‌, అచ్యుత్‌ కుమార్, స‌చ్చనా న‌మిదాస్‌, ర‌వీంద్ర విజ‌య్ త‌దిత‌రులు ఇతర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాకు యువ సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాశ్ కుమార్ బాణీలు అందిస్తున్నారు.   
Advertisement
Mandaadi
Suhas
Vetrimaran
Kollywood
Tollywood
Sports Drama
Tamil Movie
First Look Poster
Suri
Mahima Nambiar

More Telugu News