తిరుమల గోశాలలో ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
- గోవులు అంటే కేవలం జంతువులు కాదన్న సుబ్రహ్మణ్యస్వామి
- గోవుల మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి అని విమర్శ
- టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్య
రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కల్పించారని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. గోవు అంటే కేవలం జంతువు మాత్రమే కాదని... కోట్లాది మందికి దైవమని అన్నారు. గోశాలలో గోవుల ఆలనాపాలన పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు.
వయసు మళ్లడం వల్లే గోవులు చనిపోతున్నాయని టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని... వయసు మళ్లారని మీ కుటుంబ సభ్యులను కూడా వదిలేస్తారా? అని స్వామి ప్రశ్నించారు. టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ అంశంపై కోర్టులో కేసులు వేస్తానని చెప్పారు.