గ్రూప్-1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
- గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
- ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వవద్దన్న హైకోర్టు
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చని స్పష్టీకరణ
గ్రూప్-1 ఫలితాలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. రెండు సెంటర్లలోనే 74 మందికి ర్యాంకులు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. తెలుగు మీడియం విద్యార్థులను నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వచ్చాయి.