షర్బత్ జిహాద్.. రాందేవ్ బాబా సంచలన ఆరోపణలు.. వీడియో ఇదిగో!
- కూల్ డ్రింక్స్ పేరుతో విషాన్ని అమ్ముతున్నాయని కంపెనీలపై ఫైర్
- వచ్చిన డబ్బులతో మసీదులు, మదర్సాలను నిర్మిస్తున్నాయని ఆరోపణ
- పతంజలి రోజ్ షర్బత్ ప్రమోషన్ చేస్తూ రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు
పతంజలి సంస్థ నుంచి తీసుకొచ్చిన రోజ్ షర్బత్ ప్రమోషన్ కోసం చేసిన వీడియోలో రాందేవ్ బాబా ఈ ఆరోపణలు చేశారు. ‘ఇది షర్బత్ జిహాద్.. కూల్‌డ్రింక్స్ పేరుతో కంపెనీలు అమ్ముతున్న మరుగుదొడ్లను శుభ్రం చేసే విషం నుంచి మీ కుటుంబాన్ని కాపాడండి. పతంజలి షర్బత్, జ్యూస్‌లను మాత్రమే ఇంటికి తీసుకెళ్లండి. ఈ షర్బత్ మీ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు మీ డబ్బు గురుకులాలు, పతంజలి యూనివర్సిటీ నిర్మాణానికి ఉపయోగపడుతుంది’ అంటూ రాందేవ్ బాబా వీడియోలో సూచించారు.