NTR: ఎన్‌టీఆర్‌-నీల్ మూవీ బిగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది!

Big Update on Jr NTR and Prashanth Neels Upcoming Movie
షార్ట్స్‌లో చూడండి
యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ నెల 22 నుంచి తార‌క్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటార‌ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక ఈ క్రేజీ అప్‌డేట్‌తో ఎన్‌టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

కాగా, ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. డ్రాగ‌న్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందించనున్నారు.
Go Back to Shorts
NTR
Prashanth Neel
NTR31
Telugu Movie
Action Drama
Movie Update
Shooting Begins
Ravi Basrur
Mythri Movie Makers
NTR Arts

More Telugu News