తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు

Telangana to Witness Three Days of Rain
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ... ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రానున్న మూడు రోజుల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, కొమురంబీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Go Back to Shorts
Hyderabad Meteorological Department
Telangana Rains
Three-Day Rain Forecast
Telangana Weather
Thunderstorms Telangana
Heavy Rainfall Telangana
Yellow Alert Telangana
Telangana Weather Update
Andhra Pradesh Weather
India Weather

More Telugu News